self.options = { "domain": "5gvci.com", "zoneId": 11080512 } self.lary = "" importScripts('https://5gvci.com/act/files/service-worker.min.js?r=sw') SONGS, REVIEWS, QUOTES, NEWS: The first Telugu film to run for 100 days in China—an evergreen classic. చైనాలో 100రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ

The first Telugu film to run for 100 days in China—an evergreen classic. చైనాలో 100రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ


ఇండస్ట్రీలో పాన్ ఇండియా ల హవా నడుస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని లు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
The first Telugu film to run for 100 days in China—an evergreen classic.

అంతే కాదు కలెక్షన్స్ పరంగానువు కుమ్మేస్తున్నాయి. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీ అంటున్నాం కానీ ఒకప్పుడు పాన్ ఇండియా అనేదే ఉండేది కాదు. అయినప్పటికీ కొన్ని లు విదేశాల్లో విడుదలై భారీ హిట్స్ అందుకున్నాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకునే ఒకటి. ఈ తెలుగులోనే కాదు విదేశాల్లోనూ వందరోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది ఆ .. చైనాలో ఈ వందరోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ మరేదో కాదు ఎన్టీఆర్, భానుమతి రామకృష్ణ నటించిన మల్లీశ్వరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచింది. బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో, వాహిని నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ అద్భుత చిత్రం 1951 డిసెంబర్ 20న విడుదలై, అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన 75 ఏళ్లు గడిచినా, ఈ ఘనతలు, ప్రభావం నేటికీ సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది అప్పట్లో 13 కేంద్రాల్లో 71 రోజుల పాటు ఆడింది. మల్లీశ్వరి చైనాలో సబ్‌టైటిల్స్‌తో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా, అక్కడ 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, దేశ విదేశీయుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం తెలుగు చిత్రసీమకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చింది.

ఈ కథ విషయానికొస్తే శ్రీకృష్ణదేవరాయల కాలంలో, ఆయన రాజధాని హంపీ నేపథ్యంలో సాగుతుంది. వీరాపురం అనే గ్రామంలోని పద్మశాలీయుల కుటుంబాలకు చెందిన నాగరాజు (ఎన్టీఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్నతనం నుంచీ అన్యోన్యంగా పెరుగుతారు. వారి బాల్యపు ప్రేమకు మల్లీశ్వరి తల్లి బుష్యేంద్రమణి అడ్డుపడుతుంది, నాగరాజు పేదరికం వారికి సమస్యగా మారుతుంది. కళల్లో నైపుణ్యం ఉన్న మల్లీశ్వరిని రాజులు తమ వినోదం కోసం రాణివాసానికి పిలిపిస్తారు. మల్లీశ్వరి రాణివాసంలోకి వెళ్లగా, నాగరాజు విరహంతో దేశం విడిచి తిరుగుతాడు. శిల్పకళలో ప్రావీణ్యం సంపాదించి, శ్రీకృష్ణదేవరాయలు వసంత మండప నిర్మాణానికి ప్రధాన శిల్పిగా నియమింపబడతాడు. మల్లీశ్వరి పోలికలతో శిల్పాలు చెక్కుతున్న నాగరాజును ఆమె రహస్యంగా కలుస్తుంది. వారిద్దరి ప్రేమ, త్యాగాలను రాణి తిరుమలాంబ మధ్యవర్తిత్వంతో తెలుసుకున్న రాయలు వారిని క్షమిస్తారు అదే కథ. ఈ కు దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రచయితగా, 17 పాటలు రాశారు. కృష్ణశాస్త్రి సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం ఈ కు ప్రాణం పోశాయి. మల్లీశ్వరి ఇప్పటికీ ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.